బ్యాంకుల దెబ్బ..5వ రోజూ భారీ నష్టాలే

11 Aug, 2017 15:36 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా  ఐదో రోజు కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. మరోవైపు యూరప్‌సహా ఆసియా మార్కెట్లన్నీ నెగిటివ్‌గా ఉండగంతో దేశీయంగానూ  దాని ప్రభావం కనిపించింది. ఆరంభంనుంచీ  భారీ అమ్మకాల ఒత్తిడితో భారీ పతనాన్ని నమోదు చేసిన మార్కెట్లు చివరలో  రీ బౌండ్‌ అయ్యాయి. చివరికి  సెన్సెక్స్‌   318పాయింట్లు పతనమై 31,213 కు చేరగా.. నిఫ్టీ 109  పాయింట్లు పడిపోయి 9,710 వద్ద   ముగిసింది.  ఒక దశలో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా కోల్పోగా,నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,700 స్థాయి కిందికి దిగజారినా  ఆఖరి అర్ధగంటలో పుల్‌ బ్యాక్‌ ర్యాలీ వచ్చింది. దీంతో వారాంతంలో  కోలుకోవడం విశేషం. అయితే ఎనలిస్టులు మాత్రం అప్రమత్తతను  వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగగా ప్రభుత్వ బ్యాంకులు మరింత కుదేలయ్యాయి.  దీంతో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5 శాతం  మెటల్‌, ఆటో, రియల్టీ రంగాలు  పతనమయ్యాయి.  ఫలితాల దెబ్బతో బాష్‌, ఎస్‌బీఐ, టీవీఎస్‌  మోటార్‌ నష్టపోగా, హిందాల్కో, వేదాంతా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా,  ఎంఅండ్‌ఎం, ఎల్‌ అండ్‌ టీ, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌, ఐషర్‌, టీసీఎస్‌ షేర్లలో అమ్మకాల తీవ్రత కొనసాగింది.  డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, అరబిందో, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, విప్రో, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌  లాభపడిన వాటిల్లోఉన్నాయి.
 అటు డాలర్‌ మారకంలో రుపీ మరింత పతనమైంది. 0.13 పైసల నష్టపోయి రూ. 64.21 వద్ద ఉండగా,  ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పుత్తడి పది గ్రా. రూ.87 ఎగిసి రూ. 29, 263 వద్ద ఉంది.

 

మరిన్ని వార్తలు