మార్కెట్ లాంగ్ జంప్

12 Dec, 2016 15:13 IST|Sakshi
మార్కెట్ లాంగ్ జంప్

రూపారుు క్షీణతతో ఎగుమతి రంగాల షేర్లకు బూస్ట్
ఐటీ, ఫార్మా షేర్ల ర్యాలీ కనిష్టస్థారుులో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు
సెన్సెక్స్ 456 పారుుంట్లు, నిఫ్టీ 149 పారుుంట్లు అప్

ముంబై: స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా బుల్స్ విజృభించడంతో స్టాక్ సూచీలు శుక్రవారం అనూహ్యంగా పెరిగారుు. రూపారుు క్షీణించిన ప్రభావంతో ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మా షేర్లు పరుగులు తీసారుు. దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ రివ్వున 456 పారుుంట్లు ఎగిసి, 26,344 పారుుంట్ల వద్ద క్లోజరుు్యంది. అక్టోబర్ 18 తర్వాత ఒకే రోజున సెన్సెక్స్ ఇంతగా పెరగడం ఇదే ప్రధమం. ఆ రోజున ఈ సూచీ 521 పారుుంట్ల మేర పెరిగింది. ఇక తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వరుసగా 8,000, 8,100 పారుుంట్ల స్థారుుల్ని అధిగమించింది. 149 పారుుంట్లు ఎగిసి 8,114 పారుుంట్ల వద్ద ముగిసింది.

అరుుతే డాలరుతో రూపారుు పతన ప్రభావంతో మార్కెట్లో జరిగిన రోజే రూపారుు పెరగడం విశేషం. క్రితం రోజు 68.86 రికార్డు కనిష్టానికి రూపారుు మారకపు విలువ తగ్గగా, తాజాగా 68.46 స్థారుుకి కోలుకుంది. ఈ వారం ఇప్పటివరకూ స్టాక్ సూచీలు చవిచూసిన నష్టాలన్నింటినీ తాజా ర్యాలీతో మార్కెట్ పూడ్చుకోగలిగింది. అంతేకాకుండా అంతక్రితం వారంతో పోలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ 166 పారుుంట్లు, నిఫ్టీ 40 పారుుంట్ల చొప్పున లాభాల్ని కూడా సంపాదించగలిగారుు.

పక్షం రోజుల అమ్మకాల తర్వాత....
అటు అమెరికాలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం, ఇటు పెద్ద నోట్లను రద్దుచేయడంతో పక్షం రోజులుగా జరుగుతున్న అమ్మకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని విశ్లేషకులు చెప్పారు. డిసెంబర్ డెరివేటివ్ సిరీస్ ప్రారంభమైన తొలిరోజునే తాజా లాంగ్ పొజిషన్లకు ఇన్వెస్టర్లు శ్రీకారం చుట్టారని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. ట్రేడింగ్ తొలిదశలో ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మా షేర్లు పెరిగినప్పటికీ, తదుపరి రూపారుు విలువ మెరుగుపడటంతో మిగిలిన రంగాల్లో కూడా కొనుగోళ్లు జరిగాయని ఆయన వివరించారు. పక్షం రోజులపాటు షేరు విలువలు తగ్గడంతో షేర్ల విలువలు ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారాయని, దాంతో మిడ్ క్యాప్ షేర్లు సైతం ర్యాలీలో పాలుపంచుకున్నాయని ఆయన తెలిపారు.

టీసీఎస్ 5 శాతం జూమ్...
అమెరికాలో ట్రంప్ గెలుపు కారణంగా అవుట్‌సోర్సింగ్ వ్యాపారాలపై నీలినీడలు కమ్ముకోవడంతో బాగా పతనమైన ఐటీ, ఫార్మా షేర్లు తాజా మార్కెట్ ర్యాలీలో జోరుగా పెరిగారుు.  ఇక్కడ టాటా గ్రూప్‌లో కొనసాగుతున్న వివాదం ఫలితంగా కొద్దివారాల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని చవిచూస్తున్న టీసీఎస్ 5.23% ఎగిసి రూ. 2,300 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ 4.78%, విప్రో 3.09 శాతం చొప్పున పెరగ్గా, ఫార్మా షేర్లు సన్ ఫార్మా 4.18 శాతం, అరబిందో ఫార్మా 4.07 శాతం, లుపిన్ 3.36 శాతం, సిప్లా 1.75% చొప్పున పెరిగారుు.

ఫిచ్ రేటింగ్‌‌స ఎఫెక్ట్...
భారత్ చేపట్టిన సంస్కరణలు, వడ్డీ రేట్ల తగ్గుదల ఫలితంగా మధ్యకాలికంగా చైనా ఆర్థికాభివృద్ధిని మించి భారత్ వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్‌‌స ప్రకటించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపారుు. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు పుంజుకుంటుందని ఫిచ్ తెలిపింది.

27 సెన్సెక్స్ షేర్లు అప్..: సెన్సెక్స్-30 షేర్లలో 27 షేర్లు పెరిగారుు. గెరుుల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, అదాని పోర్‌‌ట్స, టాటా స్టీల్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 2-3.5% మధ్య ర్యాలీ జరిపారుు. బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, ఎరుుర్‌టెల్‌లు స్వల్పంగా తగ్గారుు.

ఫండ్ మేనేజర్లకు ఫేవరెట్ రంగాలు
ముంబై: తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థలో వృద్ధిచెందే ఫైనాన్షియల్, కన్జూమర్, బేస్ మెటీరియల్ రంగాల పట్ల ఈక్విటీ ఫండ్ మేనేజర్లు బుల్లిష్‌గా వున్నారు. వారి ఈక్విటీ ఫండ్ పోర్ట్‌ఫోలియోల్లో ఈ రంగాలకు చెందిన షేర్లకే 50 శాతం పెట్టుబడుల్ని కేటారుుంచినట్లు ఈక్విటీ రీసెర్చ్ సంస్థ మార్నింగ్‌స్టార్ నివేదిక తెలిపింది. భవిష్యత్తులో భారత్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనావేస్తున్న నేపథ్యంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాల్లో ఫండ్ మేనేజర్ల పెట్టుబడులు వారి పోర్ట్‌ఫోలియోలో 2016 సెప్టెంబర్‌నాటికి 23.4%కి పెరిగారుు.

2015 డిసెంబర్‌లో వీటికి కేటారుుంపులు 21.1 శాతమే. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకుల షేర్లలో వారి పెట్టుబడులు ఎక్కువగా వున్నారుు. ఇక కన్జూమర్ విభాగానికి సంబంధించి ఆటోమొబైల్ షేర్లలో ఫండ్‌‌స కేటారుుంపులు బాగా పెరిగారుు. బేస్ మెటీరియల్ విభాగంలో సిమెంటు, ఉక్కు, బిల్డింగ్ మెటీరియల్ షేర్లలో ఫండ్ మేనేజర్లు జోరుగా పెట్టుబడి చేశారు. అరుుతే యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన ప్రభావంతో టెక్నాలజీ రంగం ఫండ్ మేనేజర్ల ఆసక్తిని కోల్పోతున్నదని నివేదిక తెలిపింది.

>
మరిన్ని వార్తలు