కొనుగోళ్ల జోరు :  సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్‌

24 Apr, 2019 14:52 IST|Sakshi

సాక్షి, ముంబై:  మూడురోజుల నష్టాల తర్వాత  సానుకూలంగా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు మిడ్‌ సెషన్‌తరువాత మరింత జూమ్‌ అయ్యాయి. ఆరంభంలో ఊగిసలాడిన  కీలక సూచీలకు ప్రస్తుతం కొనుగోళ్ల మద్దతు భారీగా లభిస్తోంది. దీంతో సెన్సెక్స్‌ 351పాయింట్లు జంప్‌ చేసి 38,915 వద్ద, నిఫ్టీ లాభాల సెంచరీ సాధించి (+113) 11689 వద్ద ఉత్సాహంగా దౌడు తీస్తోంది. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా లాభపడుతున్నాయి. 

బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌,  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, టైటన్‌ లాభపడుతున్నాయి. అయితే టాటా మోటార్స్‌ అల్ట్రాటెక్‌, హీరో మోటో,వేదాంతా, గ్రాసిమ్‌, యాక్సిస్‌, పవర్‌గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్‌ నష్టపోతున్నాయి. ఫలితాల ప్రకటించిన  మారుతి నష్టపోతోంది. 

మరిన్ని వార్తలు