లాభాల కళ : బ్యాంక్స్ రీబౌండ్

7 Apr, 2020 09:34 IST|Sakshi

సాక్షి, ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. సెన్సెక్స్1183 పాయింట్లు ఎగిసి 28774 వద్ద, నిఫ్టీ 321 పాయింట్ల లాభంతో 8405 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.  అన్ని రంగాల షేర్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ టాప్ గెయినర్ గా వుంది. నిఫ్టీ బ్యాంకు వెయ్యి పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతోంది. ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఎం అండ్ ఎండ్, యాక్సిస్, కోటక్ మహీంద్ర, హెచ్ యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, వేదాంతా, టైటన్, హీరో, సన్ ఫార్మ లాభాలతో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ 5 శాతం నష్టపోతోంది. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం మనీ మార్కెట్లు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. ఏప్రిల్ 17 వరకు ఈ సవరించిన వేళలు వర్తించనున్నాయి. 

మరిన్ని వార్తలు