కొనుగోళ్ల జోరు : 32 వేల ఎగువకు సెన్సెక్స్

28 May, 2020 15:53 IST|Sakshi

32 వేల ఎగువకు సెన్సెక్స్

9500 మార్క్ నకు సమీపంలో నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంనుంచి లాభాలతో మురిపించిన సూచీలు  రోజంతా అదే ధోరణినికొనసాగించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. దీంతో  సునాయాసంగా సెన్సెక్స్ 32 వేల ఎగువకు చేరింది. చివరకు సెన్సెక్స్ 595 పాయింట్లు ఎగిసి 32200 వద్ద, నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో  9490 వద్ద ముగిసింది.  తద్వారా నిఫ్టీ కీలకమైన 9500 మార్క్ నకు సమీపంలో వుంది. 

బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, మెటల్ సూచీలు 2-3 శాతం పెరిగాయి. ఫైనాన్షియల్ హెవీవెయిట్స్ హెచ్ డీఎఫ్సీ బ్యాంక్,  ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్  కోటక్ మహీంద్రా  బాగా లాభపడ్డాయి. ఐషర్ మోటార్స్  టాప్ గెయినర్ గా వుంది. జీ, హీరో మోటోకార్ప్,  ఎల్ అండ్ టీ,  బ్రిటానియా  కూడా లాభపడ్డాయి. మరోవైపు బీపీసీఎల్, ఐటీసీ,  విప్రో, టీసీఎస్, భారతి ఎయిర్టెల్,ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా,  హిందుస్తాన్ యూనిలీవర్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా  ముగిసింది.  గత ముగింపు 75.72 తో పోలిస్తే  గురువారం 75.75 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు