లాభాల జోరు: 34వేలకు పైన సెన్సెక్స్‌

5 Jan, 2018 09:37 IST|Sakshi

ముంబై : నష్టాలకు బ్రేకిస్తూ.. గురువారం లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు, శుక్రవారం ట్రేడింగ్‌లోనూ లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్‌ 34వేల పైకి, నిఫ్టీ 10,500 పైకి ఎగిశాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 121 పాయింట్లు లాభపడి 34,090 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంలో 10,536 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఆర్‌కామ్‌ షేర్లు 6 శాతం, ఐడియా 3 శాతం లాభపడగా.. ఎస్‌బీఐ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, యస్‌ బ్యాంకు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, వేదంత, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీలు లాభాల పంట పండించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 నెలల సరికొత్త గరిష్టాలకు పెరిగింది. రూపాయి బలపడుతుండటంతో, టెక్నాలజీ షేర్లు నష్టాలు గడిస్తున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహింద్రా, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు స్వల్పంగా నష్టపోయాయి.

>
మరిన్ని వార్తలు