మార్కెట్ల యూ టర్న్: భారీ రికవరీ

12 Jun, 2020 15:48 IST|Sakshi

భారీ నష్టాలనుంచి లాభాల్లోకి

9950 ఎగువకు నిఫ్టీ

గత రెండు నెలలో బిగ్గెస్ట్ ఇంట్రాడే గెయిన్ 

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుని లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో 1100 పాయింట్లకుపైగా  కోల్పోయిన సెన్సెక్స్ మిడ్ సెషన్ నుంచి భారీ రికవరీ సాధించింది. చివరికి 243 పాయింట్లు ఎగిసి 33781 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 9972 వద్ద స్థిరంగా ముగిసాయి. తద్వారా వారాంతంలో పాజిటివ్ గా ముగిసిన ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.  బ్యాంకింగ్ ఆటో సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఈ రోజు  కనిష్టం నుంచి సెన్సెక్స్ 1433  పాయింట్లు, నిఫ్టీ  429 పాయింట్లు ఎగిసాయి. అదే విధంగా నిప్టీ బ్యాంకు 1128 పాయింట్లు పుంజుకోవడం విశేషం. దీంతో నిఫ్టీ తిరిగి 9950 పాయింట్ల ఎగువకు చేరింది.  (స్టాక్ మార్కెట్ భారీ పతనం)

ఎం అండ్ ఎండ్, హీరో మోటో, భారతి ఇన్‌ఫ్రాటెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, సన్ ఫార్మా, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్ భారీ లాభాలు ఆర్జించాయి. మరో వైపు జీ టాప్ లూజర్ గా వుంది. అటు హెచ్1బీ వీసా జారీ తాత్కాలిక రద్దు వార్తలతో ఐటీ షేర్లు  అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  (రూ. 3.5 లక్షల కోట్లు మటాష్!)

మరిన్ని వార్తలు