లాభాల్లోకి మార్కెట్ల రీబౌండ్

9 Sep, 2019 13:59 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో ఆరంభ  నష్టాలనుంచి  కీలక సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలకు ఎగువకు చేరాయి. ఈ  బౌన్స్‌బ్యాక్‌ తో  సెన్సెక్స్‌ కనిష్టం నుంచి దాదాపు 400 పాయింట్లు ఎగిసింది.  దీంతో సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్ను అధిగమించాయి.  కానీ మిడ్‌ సెషన్‌ తరువాత  వెనక్కి తగ్గాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 95 పాయింట్లు పుంజుకుని 37070  వద్ద, నిఫ్టీ 28  పాయింట్లు లాభాలకుపరిమితమై 10975 వద్ద ఉంది.

ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో రంగాలు లాభపడుతుండగా,  ఐటీ స్వల్పంగా నష్టపోతోంది. యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌ భారీ లాభపడుతుండగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌  నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు