మార్కెట్ల భారీ రికవరీ : సెంచరీ లాభాలు

3 Jul, 2018 15:41 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆరంభంలో నష్టాలు,మిడిసెషన్లో ఊగిసలాటల మధ్య కొనసాగిన మార్కెట్లు చివర్లో పుంజుకుని  లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్టు కోలుకోవడంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో లాభాల బాట పట్టిన  దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉత్సాహంగా కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌  114 పాయింట్లు పెరిగి 35,378వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు ఎగసి 10,699 వద్ద ముగిశాయి.  ఫార్మా, ఐటీ, ఆటో రంగాలు లాభపడగా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ నష్టపోయింది.

బజాజ్‌ ఫిన్‌, మారుతీ, ఓఎన్‌జీసీ, హీరోమోటో, గెయిల్‌, బీపీసీఎల్‌ లాభపడగా, అయితే అరబిందో, దివీస్‌, సిప్లా, బయోకాన్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్లెన్‌మార్క్‌, లుపిన్‌, పిరమల్‌ లాభాలను సాధించాయి.   మరోవైపు వేదాంతా  , ఇన్‌ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, గ్రాసిమ్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.  
 

మరిన్ని వార్తలు