ఊగిసలాడుతున్న మార్కెట్లు

10 May, 2019 14:14 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలో అధిక నష్టాల నుంచి  కాస్త తెప్పరిల్లాయి. ఆరంభంలో1 50 పాయింట్లకుపైగాపుంజకున్నాయి.  అయితే ఆ తరువాత  కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌11 పాయింట్లు లాభానికి పరిమితమై  37573 వద్ద, నిఫ్టీ  కేవలం 4 పాయింట్ల లాభంతో  11,307 వద్ద ఊగిసలాడుతున్నాయి.

మరోవైపు అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ దిగుమతి సుంకాల వాదన కొనసాగుతోంది. వాణిజ్య వివాద  డీల్‌ కుదరకుంటే 200 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై సుంకాల విధింపు తప్పదన్న  ఆయన సంకేతాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, మీడియా  ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌  స్వల్పంగా లాభపడుతున్నాయి.  జీ, ఎస్‌బ్యాంకు, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ  బ్యాంకు, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌,  టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్‌, బ్రిటానియా  లాభపడుతున్నాయి.

అటు ఫలితాల ప్రభావంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.5 శాతం పతనం కాగా..ఎస్‌బీఐ మొదట నష్టపోమయినా.. ప్రస్తుతం లాభాల్లోకి మళ్లింది.  బజాజ్ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌, పవర్‌గ్రిడ్‌, ఐవోసీ 2-1 శాతం మధ్య క్షీణించాయి

మరిన్ని వార్తలు