లాభాల్లో మార్కెట్లు, 39వేల ఎగువకు సెన్సెక్స్‌

23 Oct, 2019 13:43 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు మిడ్‌సెషన్‌లో పుంజుకున్నాయి.  సెన్సెక్స్‌ 217 పాయింట్లు  ఎగిసి 39178 వద్ద,  నిఫ్టీ సైతం 53 పాయింట్లు  లాభపడి 11,642 వద్ద ట్రేడవుతోంది. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్ ఫలితాలు నిరాశపరచడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు డీలాపడగా.. బ్రెక్సిట్‌ డీల్‌పై అస్పష్టతలోనూ యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. 

ప్రధానంగా ఆటో, రియల్టీ రంగాలు బలహీనంగానూ, ఐటీ బలంగానూ   ట్రేడ్‌ అవుతున్నాయి.  హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, బ్రిటానియా, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, యాక్సిస్‌, టైటన్‌, ఐటీసీ, ఐసీఐసీఐ, ఏషియన్‌ పెయింట్స్‌ లాభపడుతుండగా, లాభాల స్వీకరణతో యస్‌ బ్యాంక్‌ 4 శాతం పతనమైంది. దీంతో పాటు  అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, జీ, గ్రాసిమ్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌  నష్టపోతున్నాయి. 

>
మరిన్ని వార్తలు