భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

13 Nov, 2018 14:20 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలతో తొలుత నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు  క్రమంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లు  పుంజుకోవడంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్తాయిలను అధిగమించాయి. సెన్సెక్స్‌ 275పాయింట్లుఎగిసి 35085ను అధిగమించగా  నిఫ్టీ 84 పాయింట్లు పుంజుకుని 10,566 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి. ఫార్మా నష్టపోతోంది. బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, ఐషర్, అల్ట్రాటెక్‌, ఎన్‌టీపీసీ, గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, బ్రిటానియా   భారీగా లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి ఆరంభంలోనే 29పైసలు  లాభపడింది.

మరిన్ని వార్తలు