భారీ లాభాల్లోకి  సూచీలు, బ్యాంక్స్‌ అప్‌

9 Oct, 2019 13:18 IST|Sakshi

 సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు ఉన్నట్టుండి లాభాల్లోకి  మళ్లాయి.  సెన్సెక్స్‌ ఏకంగా 366 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభాలతో కొనసాగుతోంది. ఆరంభంలో నామమాత్రపు లాభాలతో ఉన్నకీలక  సూచీలు ఒక దశలో 100 పాయింట్లకు పైగా క్షీణించాయి. కానీ అనంతరం ఇన్వెస‍్టర్ల కొనుగోళ్లతో భారీగా పుంజుకున్నాయి.  ప్రస్తుతం సెన్స్‌క్స్‌355 పాయింట్ల లాభంతో 37901 వద్ద నిఫ్టీ 101 పాయింట్లు ఎగిసి 11227 వద్ద కొనసాగుతున్నాయి.ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు మార్కెట్లకుభారీ మద్దతునిస్తున్నాయి.  బ్యాంక్‌నిఫ్టీ 600 పాయింట్లకుపైగా ఎగిసింది. అటు ఆటో షేర్లు కూడా లాభపడుతున్నాయి.  మరోవైపు ఐటీ, ఫార్మా బలహీనంగా ఉన్నాయి.  భారతి ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఎం అండ్‌ఎం,  ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కోటక్‌మహీంద్ర, యాక్సిస్‌, ఎల్‌ అండ్‌ టీ మారుతి సుజుకి, టాటా మోటార్స్‌,  భారీగా లాభపడుతున్నాయి. యస్‌బ్యాంకు, టైటన్‌, హెచ్‌సీఎల్‌,టెక్‌, జీ,  ఐటీసీ, హీరో, మోటో, టీసీఎస్‌,యూపిఎల్‌,రిలయన్స్‌నష్టపోతున్నాయి.  అలాగే  బై బ్యాక్‌ ఆఫర్‌తో ఇండియా బుల్స్‌ 10 శాతానికి పైగా ఎగిసింది.  ప్రస్తుతం 5శాతం లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ అయింది.

మరిన్ని వార్తలు