స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

14 Jun, 2017 15:42 IST|Sakshi

ముంబై: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. మిడ్‌ సెషన్‌ తరువాత ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో  సెన్సెక్స్‌ 52 పాయింట్లు పుంజుకుని 31,155వద్ద,  నిఫ్టీ 11 పాయింట్లు బలపడి 9,618 వద్ద  ముగిసింది. రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ , బ్యాంకింగ్‌ లాభపడగా, మెటల్‌  సెక్టార్‌ నష్టపోయింది. ప్రధానంగా  మొండిబకాయిల సమస్క పరిష్కారానికి రూపొందించిన దివాలా చట్టం(ఐబీసీ), చిన్న బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌కు తెరలేవనుండటం వంటి అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు డిమాండ్‌ పుట్టింది.  అలహాబాద్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఐడీబీఐ ఆంధ్రా బ్యాంక్‌, బీవోబీ, కెనరా, యూ నియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఓబీసీ, బీవోఐ  బాగా లాభపడ్డాయి. వీటితో పాటుముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టాప్‌ విన్నర్‌ గా నిలిచింది.అలాగే డా. రెడ్డీస్‌,  లవబుల్‌ లింగరీస్‌ భారీగా  లాభపడ్డాయి.  సిప్లా ఎస్‌ బ్యాంక్‌,  ఐసీసీ, ఎసీసీ నష్టాల్లో ముగిశాయి.
 
అటు డాలర్‌ మారకంలో రుపాయి 0.07పైసలు లాభపడి రూ.64.27వ ద్ద ఉండగా, ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పుత్తడి పది  గ్రా. 12 రూపాయలు క్షీణించి రూ.28, 932 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు