లాభాల జోరు : 11650ఎగువకు నిఫ్టీ

29 Oct, 2019 09:45 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాంగ్‌ వీకెండ్‌ తరువాత మంగళవారం  ఫ్లాట్‌గా  ప్రారంభమైనాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  కీలక సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్లు ఎగిసి 39381 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 11662వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. టెలికాం తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.  ప్రదానంగా ఆటో, మెటల్‌ లాభాలు  మార్కెట్‌ను లీడ్‌ చేస్తున్నాయి.  టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, టాటా స్టీల్‌, రిలయన్స్‌, టీసీఎస్‌,మారుతి,  ఐసీఐసీఐ, బజాజ్‌   లాభపడుతుండగా, భారతి ఎయిర్‌టెల్‌, ఎస్‌బ్యాంకు, నెస్లే,  భారతి ఇన్‌ఫ్రాటెల్‌,కోల్‌ ఇండియా, గ్రాసిం, కోటక్‌ మహీంద్ర,  నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు