లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

2 Jan, 2020 10:28 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.  కొత్త ఏడాదిలో వరుసగా రెండో సెషన్‌లో కూడా 150 పాయింట్లకు పైగా పాజిటివ్‌గా ఉన్న కీలక సూచీ సెన్సెక్స్‌, నిఫ్టీ  స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 116 పాయింట్లు లాభపడి 41421వద్ద, నిఫ్టీ 37 పాయింట్లు ఎగిసి 12219 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభ పడుతున్నాయి. ప్రధానంగా వాహనాల అమ్మకాలు పుంజుకున్న మారుతి లాభపడుతోంది. మెటల్‌ షేర్లలో జెఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్‌, హిందాల్కో, వేదాంతా అలాగే  రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌,మారుతి, హీరో మోటో లాభపడుతుండగా, జీ, కోల్‌ ఇండియా, టైటన్‌, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌ నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి ఆరంభంలోనే నష్టపోయింది.  బుధవారం నాటి ముగింపు 71.22 తో పోలిస్తే 71.27 వద్ద ప్రారంభమై, అనంతరం ఏకంగా 11 పైసలు క్షీణించి 71.33 స్థాయికి చేరింది.
  

మరిన్ని వార్తలు