లాభాల ప్రారంభం, ఊగిసలాట

18 Nov, 2019 09:43 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆసియా మార్కెట్ల సానుకూలతతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ ఒక దశంలో  200 పాయింట్ల లాభం సమీపంలోకి వచ్చింది. నిఫ్టీ 11950 పాయింట్లకు చేరువలోకి చేరుకుంది.  కానీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో వెనుకంజ వేసాయి.  ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 71 పాయింట్లు ఎగిసి 40431 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు లాభంతో 11917 వద్ద కొన సాగుతున్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మ సెక్టార్లు లాభపడున్నాయి. ఆటో, రియల్‌ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఎం అండ్‌ ఎం, కోల్‌ ఇండియా, గెయిల్‌,  నెస్లే, సిప్లా,  ఆసియన్‌ పెయింట్స్‌ నష్టపోతున్నాయి.  భారతి ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ,  టాటా మోటార్స్‌, సన్‌ఫార్మ, ఇండస్‌ ఇండ్‌, లార్సెన్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు