కొనుగోళ్ల జోరు: డబుల్‌ సెంచరీ లాభాలు

11 Jul, 2019 13:58 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగురోజులపాటు నష్టపోయిన కీలక సూచీలు ఆరంభంలోనే లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్‌ 265 పాయింట్లు ఎగిసి 38822 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 11578 వద్ద కొనసాగుతున్నాయి.  తద్వారా 11550 స్థాయి ఎగువకు చేరింది. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి.

ముఖ్యంగా మీడియా, రియల్టీ, ఫార్మా, బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ లాభపడుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలోజేఎస్‌డబ్ల్యూ స్టీల్,  వేదాంతా, డా.రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌,  ఐబీ హౌసింగ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరో మోటో, హిందాల్కో, అల్ట్రాటెక్‌, గెయిల్‌, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లాభపడుతుండగా  యస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, ఐవోసీ, యాక్సిస్‌ బ్యాంక్‌  నష్టపోతున్నాయి.  అటు ప్రమోటర్ల మధ్య వివాదం సెబీకి చేరడంతో గురువారం ఇండిగో షేరు  ఏకంగా 5.25 శాతం కుప్పకూలింది. 

మరిన్ని వార్తలు