150 పాయింట్ల లాభం : 11600 పైకి నిఫ్టీ

12 Jul, 2019 14:26 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ఉత్సాహంగా కదులుతున్నాయి. ఆరంభంలో స్వల్ప ఒడిదొడుకులకు  లోనైనా మిడ్‌ సెషన్‌ తరువాత కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 140  పాయింట్లు లాభపడి 38,960 వద్ద,  నిఫ్టీ  40 పాయింట్లు పుంజుకుని 11,626 వద్ద ట్రేడవుతోంది.   దీంతో నిఫ్టీ 11600 ఎగువకు చేరింది.


మెటల్‌, రియల్టీ, మీడియా రంగాలు లాభపడుతుండగా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌  స్వల్పంగా నష్టపోతున్నాయి. టాటాస్టీల్‌,  సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, వేదాంతా, యూపీఎల్‌, హీరో మోటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ లాభపడుతున్నాయి. మరోవైపు  విప్రో, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌, ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌  స్వల్పంగా నష్టపోతున్నాయి. అలాగే క్యూ1 ఫలితాలు నిరాశపర్చడంతో ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులో అమ్మకాలు కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు