కొనసాగుతున్న బుల్‌ రన్‌

20 Dec, 2019 09:55 IST|Sakshi

41800  పాయింట్లను తాకిన సెన్సెక్స్‌ 

12300 కి సమీపంలో  నిఫ్టీ 

సాక్షి, ముంబై:  దేశీ స్టాక్‌మార్కెట్లు లాభాలతో  ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గతకొన్ని సెషన్లుగా  రోజుకో కొత్త గరిష్టాన్ని నమోదు చేస్తున్న  సూచీలు శుక్రవారం అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ప్రారంభంలోనే మరో కొత్త రికార్డుస్థాయిని నమోదు చేసాయి. సెన్సెక్స్‌ 41800 స్థాయిని తాకగా, నిఫ్టీ 12300 స్థాయికి అతి సమీపంలో ఉంది. నిఫ్టీ బ్యాంకు నిన్నటి నష్టాలనుంచి  కోలుకుని ప్రస్తుతం బాగా లాభపడుతోంది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 109 పాయింట్లు జంప్‌చేసి 41,773 వద్ద,  నిఫ్టీ 28 పాయింట్లు  పుంజుకుని 12,286 పాయింట్ల వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.

దాదాపు అన్నిరంగాల  షేర్లు  లాభాల్లోనే కొనసాగుతున్నాయి. యస్‌ బ్యాంకు, హీరో మోటో, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ, మారుతి సుజకి, టాటా మోటార్స్, టీసీఎస్‌ లాభపడుతున్నాయి. మరోవైపు వేదాంతా, గెయిల్‌, కోటక్‌ మహీంద్ర, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక​, ఐటీసీ నష్టపోతున్నాయి.  అటు డాలరుమారకంలో  దేశీయ కరెన్సీ రూపాయి శుక్రవారం నెగిటివ్‌గా వుంది. డాలర్‌తో పోలిస్తే 12 పైసల నష్టంతో 71.15 వద్ద కొనసాగుతోంది. 

>
మరిన్ని వార్తలు