రిలయన్స్ రికార్డు, సూచీలు జంప్

19 Jun, 2020 15:57 IST|Sakshi

 అత్యంత విలువైన మొదటి భారతీయ కంపెనీగా  రిలయన్స్ 

10200 ఎగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచి సానుకూలంగా ఉన్న కీలక సూచీలు అనంతరం మరింత పుంజుకున్నాయి. తద్వారా ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించాయి. ఒక  దశలో 800 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్  చివరకు 524 పాయింట్ల లాభంతో 34732 వద్ద,  నిఫ్టీ 153 పాయింట్లు ఎగిసి 10244 వద్ద ముగిసింది. దాదాపు  అన్ని రంగాలు లాభపడ్డాయి.  వరుసగా రెండో రోజు కూడా లాభాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్ వారాంతంలో 3 నెలల గరిష్టం వద్ద ముగియడం విశేషం. (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ)

బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఇన్ ఫ్రాటెల్, ఓన్‌జీసీ, టాటామోటార్స్, ఐసీఐసీఐ, ఎస్‌బిఐ, మారుతి, యాక్సిస్, భారతి ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ భారీగా  లాభపడ్డాయి. మరోవైపు ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎం అండ్ ఎం,ఐటీసీ, ఇన్ఫోసిస్ స్వల్పంగా నష్టపోయాయి. ప్రధానంగా రుణ రహిత సంస్థగా అవతరించిన  రిలయన్స్ షేరు 6 శాతానికి పైగా ఎగిసి 1788 రూపాయల వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్  కూడా 11 లక్షల కోట్ల  రూపాయల స్థాయిని అధిగమించింది.  దీంతో ఈ ఘనతను (150 బిలియన్ డాలర్ల విలువైన) సాధించిన  మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. 

చదవండి : చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ
మింత్రా సేల్ : 5 వేల ఉద్యోగాలు

మరిన్ని వార్తలు