లాభాల స్వీకరణ: నష్టాల్లోకి మార్కెట్‌

22 Jul, 2020 09:31 IST|Sakshi

ఫార్మా, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు 

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ వరుసగా 6రోజూ లాభాలతో ప్రారంభమై.. వెంటనే నష్టాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 38వేలపైన 38012 వద్ద మొదలైంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11183 వద్ద  ప్రారంభమైంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకింగ్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 22,907.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫార్మా షేర్లు కూడా లాభపడ్డాయి. మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 35 పాయింట్ల నష్టంతో 37894.71 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లను కోల్పోయి 11,135 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బజాజ్‌ అటో, ఎల్‌అండ్‌టీ, ర్యాలీస్‌ ఇండియాతో సహా 39 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

మిశ్రమంగా అంతర్జాతీయ సంకేతాలు: ఇక అంతర్జాతీయ మార్కెట్లను తీరు పరిశీలిస్తే..., నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం ట్రిలియన్‌ డాలర్లతో మరో ప్యాకేజీని ప్రకటించవచ్చనే అంచనాలు అమెరికా మార్కెట్లకు లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ఇక నేడు మన మార్కెట్‌ ప్రారంభసమయానికి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. జపాన్‌, సింగపూర్‌, థాయిలాండ్‌ దేశాల ఇండెక్స్‌ అరశాతం నష్టాల్లో కదులుతున్నాయి. హాంగ్‌కాంగ్‌, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌, చైనాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

విప్రో, మారుతి, జీలిమిటెడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టాన్ని చవిచూశాయి. సన్‌ఫార్మా, డాక్టర్‌రెడ్డీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 12శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి

మరిన్ని వార్తలు