నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

12 Nov, 2018 14:20 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనా మిడ్‌సెషన్‌ నుంచీ పెరిగిన అమ్మకాల ఒత్తిడితో   ప్రస్తుతం సెన్సెక్స్‌ 206 పాయింట్లు క్షీణించి 34,952వద్ద,  నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 10,524 వద్ద  కొనసాగుతోంది.  ముఖ్యంగా  సెన్సెక్స్‌ 35 వేల పాయింట్ల కీలక మార్క్‌ దిగువకు చేరింది.

 ఐటీ నహా మిగిలిన అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ , ఆటో, రియల్టీ, మెటల్‌ బలహీనంగా ఉన్నాయి. టైటన్‌ 5.75 శాతం జంప్‌చేయగా.. టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌  లాభాల్లో కొనసాగుతున్నాయి.   అటు హెచ్‌పీసీఎల్‌ దాదాపు 6 శాతం పతనంకాగా, టాటా మోటార్స్‌, హిందాల్కో, హీరోమోటో, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, జీ, అల్ట్రాటెక్‌ నష్టపోతున్నాయి.  

మరిన్ని వార్తలు