55 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!

25 Jun, 2014 17:15 IST|Sakshi
55 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్!
భారత స్టాక్ మార్కెట ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసింది. ఇరాక్ లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు ఒడిదుడుకులు లోనవుతున్నాయి. జూన్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్న నేపథ్యంలో సెన్సెక్స్ 55 పాయింట్లు కోల్పోయి 25313 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11 పాయింట్లు క్షీణించి 7569 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో బజాజ్ ఆటో, మారుతి సుజుకీ, గెయిల్, కోల్ ఇండియా, హెచ్ యూఎల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, ఐటీసీ, ఓఎన్ జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్ సీ, లార్సెన్ కంపెనీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. 
 
మరిన్ని వార్తలు