నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

2 Aug, 2017 15:45 IST|Sakshi

ముంబై: దేశీయ  స్టాక్‌మార్కెట్లునష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి ఊగిసలాటల మధ్యసాగిన మార్కెట్లలో ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటన తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ  వెంటనే కోలుకుని  నష్టాలనుపరిమితం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 98 కోల్పోయి 32476వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు  క్షీణించి 10081 వద్ద ముగిశాయి.  తద్వారా నిఫ్టీ రికార్డ్‌ హైనుంచి కిందికి పడింది. అయితే  బ్యాంక్‌ నిఫ్టీ స్వల్ప లాభాలతో 25వేలకు ఎగువన క్లోజ్‌ అయింది.  ఎస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓన్‌జీసీ, మారుతి  సుజుకి నష్టాల్లోనూ , ఇమామి, సన్‌టీవీ, బయోకాన్‌, వోల్టాస్‌, హీరో మోటార్‌ లాభాల్లోను  ముగిశాయి.
అటు డాలర్‌ మారకరంలో రుపీ బుధవారం భారీగా    పుంజుకుంది.   0.31 పైసలు లాభపడి రూ.63.77 వద్ద 64రూపాయలను అధిగమించింది.  పుత్తడి ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పుత్తడి పది గ్రా. రూ. 46 లాభపడి రూ. రూ.28, 450 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు