నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!

27 May, 2014 11:58 IST|Sakshi
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్!
బ్యాంకింగ్, చమురు, గ్యాస్ రంగాల కంపెనీ షేర్లలో అమ్మకాలు జోరందుకోవడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం లాంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలను నష్టాల్లోకి నెట్టాయి.
 
మధ్యాహ్నం సమయానికి నిన్నటి ముంగింపుకు సెన్సెక్స్ 178 పాయింట్ల నష్టంతో 24537 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు క్షీణించి 7306 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
 
సూచీ అధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా గెయిల్ 6.61 శాతం, భెల్ 4.36, ఎం అండ్ ఎం 3.42, ఐడీఎఫ్ సీ 3.33, అంబుజా సిమెంట్స్ 2.59 శాతం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. 
 
ఇన్ఫోసిస్, లుపిన్, అల్ట్రా టెక్ సిమెంట్, లార్సెన్, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. 
మరిన్ని వార్తలు