స్టాక్‌మార్కెట్లు 350 పాయింట్లకు పైగా పతనం

28 Aug, 2019 14:36 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా భారీ లాభాలతో మురిపించిన దలాల్‌ స్ట్రీట్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఈ ప్రభావంతో  ఫ్లాట్‌గా ప్రారంభమై ఒడిదొడుకులమధ్య ఊగిసలాడిన సెన్సెక్స్‌  నష్టాలనుంచి మరింత  కిందికి  పడింది. సెన్సెక్స్‌ 367పాయింట్లు పతనమై 37285 వద్ద, నిప్టీ కూడా ఇదే బాటలో పయనిస్తూ ఏకంగా 100 పాయింట్లకు పైగా దిగజారింది. ప్రస్తుతం నిఫ్టీ  112 పాయింట్లు క్షీణించి 10994 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తద్వారా నిప్టీ 11వేలకు దిగువకు చేరింది. గురువారం(29న) ఆగస్ట్‌ నెల డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా మార్కెట్లు హెచ్చుతగ్గులను చవిచూస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అలాగే మాంద్యం గురించి ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారులు భారత ప్రభుత్వం నుండి తాజా సూచనల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

ప్రధానంగా మెటల్‌ భారీగాను ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ  ఒక శాతం మేర నష్టపోతున్నాయి. రియల్టీ, ఐటీ, మీడియా  స్వల్పంగా లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఇండస్‌ఇండ్, జీ, ఐషర్, పవర్‌గ్రిడ్‌, సిప్లా, బజాజ్‌ ఆటో లాభాల్లోనూ, పతనంకాగా.. ఐబీ హౌసింగ్‌, హెచ్‌యూఎల్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, మారుతీనష్టాల్లోనూ  కొనసాగుతున్నాయి.  మరోవైపు యస్‌ బ్యాంక్‌ 7 శాతం,  ఐడీబీఐ 11 శాతం పతనమైంది.

>
మరిన్ని వార్తలు