వారాంతంలోనూ  బలహీన ముగింపు

10 May, 2019 16:01 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభం లాభాలన్నీ  ఆవిరైపోగా.. కీలక సూచీలు చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లకు పైగా పుంజుకున్నా..  రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఒక దశలో చివరి  గంటలో  తిరిగి 100  పాయింట్ల మేర పుంజుకుంది.  కానీ అమ్మకాల ఒత్తిడితో   చివరకు నష్టాల్లో ముగియడం గమనార్హం.

సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,462  (38వేల దిగువన) వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 11278  (11300 కు దిగువన) వద్ద స్థిరపడింది. దీంతో  వారాంతంలో కీలక మద్దతు స్థాయిలకు దిగువన ముగిసి మరింత బలహీన సంకేతాలనందించింది. ముఖ్యంగా అమెరికా చైనా ట్రేడ్‌వార్‌, దేశీయంగా ఎన్నికల వాతారణం నేపథ్యంలో  ఇన్వెస్టర్ల అప్రమత్తంగా వ్యవహరించనున్నారని  ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  

ఒక్క బ్యాంకింగ్‌ సెక్టార్‌ తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి.  బ్యాంకు నిఫ్టీ 29వేల ఎగువకు ముగిసింది. మెటల్‌, ఐటీ, ఫార్మ, ఎఫ్‌ఎంసీ, రియల్టీ, ఐటీ నష్టపోయాయి. ఒక విధంగా బ్యాంకింగ్‌ రంగ లాభాలు  నిఫ్టీ పతనాన్ని నిలువరించాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడ్డాయి.  అలాగే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌, ఎస్‌ బ్యాంకు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. 

మరిన్ని వార్తలు