వీడని చమురు సెగ : భారీ అమ్మకాలు

17 Sep, 2019 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాల ఒత్తిడి భారీగా పెరగడంతో దలాల్‌ స్ట్రీట్‌లో నిఫ్టీ, సెన్సెక్స్‌ రెండూ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఒక దశలో 680 పాయింట్లుపైగా పతనమైన సెన్సెక్స్‌ చివరికి 642 నష్టపోయి 36481 వద్ద ముగియగా,  నిఫ్టీ  186 పాయింట్లు క్షీణించి 10817 వద్ద, 10850 స్థాయిని కూడా కోల్పోయింది.  దాదాపు  అన్ని రంగాలు నష్టపోగా, బ్యాంకింగ్‌,  ఆటో, ఫార్మ  షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా నెలకొంది.  హీరో మోటో, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, బజాజ్‌ఆటో, ఇండస్‌ ఇండ్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు గెయిల్‌, హెచ్‌యూఎల్‌, ఆసియన్‌ పెయింట్స్‌, డీఆర్‌ఎల్‌   లాభపడ్డాయి.  అటు డాలరు మారకంలో రూపీ కూడా నష్టపోతోంది. మళ్లీ 72 స్థాయివైపు కదులుతోంది.

మరిన్ని వార్తలు