‘బేర్‌’ మన్న దలాల్‌ స్ట్రీట్‌

8 Jul, 2019 15:13 IST|Sakshi

సాక్షి, ముంబై : బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పన్ను పోటుకుతోడు..అంతర్జాతీయ ప్రతికూల అంశాల జత కలవడంతో దళాల్‌ స్ట్రేట్‌ ఢమాల్‌ అంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు వెల్లువెత్తాయి.  అనంతరం మరింత నష్టపోయిన సెన్సెక్స్‌ ఒక దశలో  880 పాయింట్లకు పైగా కుప్పకూలింది. చివరికి సెన్సెక్స్‌  793  పాయింట్లు కుప్పకూలి 38720 వద్ద, నిఫ్టీ 252 పాయింట్లు పతనమై 11558వద్ద  ముగిసింది. తద్వారా  సెన్సెక్స్‌ 39 వేల పాయింట్ల మైలురాయి దిగువకు, నిఫ్టీ 11 600 స్థాయిని కోల్పోయాయి. సార్వత్రిక బడ్జెట్‌,  దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత, ఆసియా మార్కెట్ల  పతనం  తదితర అంశాలు ఇన్వెస్టర్ల  అమ్మకాలకు దారితీసిందని ఎనలిస్టులు తెలిపారు. బడ్జెట్‌ రోజు శుక్రవారం కూడా నష్టపోయిన స్టాక్‌మార్కెట్లు  రెండు సెషన్లలో 1000 పాయింట్లకు పతనమైంది. ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు  అప్రమత్తత  కూడా ఈ పతనానికి తోడైంది. అన్ని రంగాలూ నష్టాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌ పతనంతో నిఫ్టీ బ్యాంకు 880 పాయింట్లకు పైగా కోల్పోయింది. రియల్టీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మెటల్‌ రంగాలు  నష్టపోయాయి.  ఐటీ స్వల్పంగా లాభపడింది.

తాజాగా మరో భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు భారీగా నష్టపోగా,  బజాజ్‌ ఫిన్స్‌ 11 శాతం నష్టపోయింది. సంస్థ సీఈవో రాజీనామాతో మైండ్‌ ట్రీ షేరు  15శాతం కుప్పకూలింది. ఎన్‌బీఐ  బీవోఐ, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా, సిండికేట్‌, ఇండియన్‌, అలహాబాద్‌, ఓబీసీ, ఎస్‌బీఐ, బీవోబీ, సెంట్రల్‌ బ్యాంక్‌, జేఅండ్‌కే బ్యాంక్‌  కుప్పకూలాయి. అలాగే   ఉత్పత్తికోతతో  మారుతి  షేర్ల అమ్మకాల వెల్లువ కొనసాగింది.  దీంతో మారుతి షేరు 52 వాకాల  కనిష్టానికి చేరింది.  దీంతోపాటు హీరో మోటో, మారుతీ, టాటా మోటార్స్, అపోలో టైర్, ఐషర్, బజాజ్ ఆటో, అశోక్‌ లేలాండ్‌, ఎంఆర్ఎఫ్‌,  బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, ఐవోసీ, గ్రాసిమ్‌, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా టాప్‌ లూజర్స్‌ జాబితాలో నిలవడం గమనార్హం​. మరోవైపు  ఇంత భారీ  పతనంలో ఎస్‌ బ్యాంక్‌  టాప్‌ విన్నర్‌గా నిలిచింది.  హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్‌ఫ్రాటెల్, టీసీఎస్‌  స్వల్పలాభాలతో  ముగిసాయి.

మరిన్ని వార్తలు