మూడు రోజుల లాభాలకు బ్రేక్‌..

16 Dec, 2019 16:49 IST|Sakshi

ముంబై : ఎఫ్‌ఎంసీజీ సహా పలు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. మూడు రోజుల పాజిటివ్‌ ట్రేడింగ్‌ అనంతరం ఇన్వెస్టరర్లు లాభాల స్వీకరణకు దిగడంతో కీలక సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీసీ, టాటా స్టీల్‌, హిందుస్తాన్‌ యూనిలీవర్‌, వేదాంత షేర్లు నష్టపోగా, టీసీఎస్‌, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడడ్డాయి. ఇక 70 పాయింట్ల నష్టంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,938 పాయింట్ల వద్ద ముగియగా, 32 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,053 పాయింట్ల వద్ద క్లోజయింది.

>
మరిన్ని వార్తలు