డబుల్‌ సెంచరీతో సెన్సెక్స్‌ షురూ

9 Jul, 2020 09:34 IST|Sakshi

హాఫ్‌ సెంచరీతో నిఫ్టీ ప్రారంభం

దాదాపు అన్ని రంగాలూ ప్లస్‌లో

మెటల్‌, రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్‌ అప్‌

మధ్య, చిన్నతరహా కౌంటర్లు ఓకే

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌ పడిన ఒక్క రోజులోనే తిరిగి మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. నిఫ్టీ సైతం హాఫ్‌ సెంచరీతో ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 168 పాయింట్లు పెరిగి 36,498కు చేరగా.. నిఫ్టీ 46 పాయింట్లు పుంజుకుని 10,753 వద్ద ట్రేడవుతోంది. తొలుత సెన్సెక్స్‌ 36,541ను అధిగమించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్‌ 1.5-1 శాతం మధ్య ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ స్వల్పంగా 0.2 శాతం వెనకడుగులో ఉంది.

దిగ్గజాల తీరిలా
నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, వేదాంతా, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్డీఎఫ్‌సీ 2.4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే బ్లూచిప్స్‌లో హీరో మోటో, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, ఐటీసీ, మారుతీ మాత్రమే(1-0.4 శాతం మధ్య) నీరసించాయి. డెరివేటివ్‌ కౌంటర్లలో సెయిల్‌, ఎన్‌సీసీ, నిట్‌ టెక్‌, జిందాల్‌ స్టీల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండిగో, ఉజ్జీవన్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క బీఈఎల్‌, ఐడియా, బయోకాన్‌, పెట్రోనెట్‌, ఎస్‌బీఐ లైఫ్‌, గోద్రెజ్‌ సీపీ 2.4-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. తొలి పావు గంట ట్రేడింగ్‌లో 964 షేర్లు లాభపడగా.. 495 నష్టాలతో కదులుతున్నాయి.

మరిన్ని వార్తలు