మార్కెట్లు 379 పాయింట్లు  హై జంప్‌

5 Mar, 2019 16:06 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. 379 పాయింట్లు జంప్‌చేసి 36,442వద్ద, నిఫ్టీ సైతం సెంచరీ సాధించింది. 124 పాయింట్లు పెరిగి 10,970 వద్ద  ముగిసింది. మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు మార్కెట్లను  ఔట్‌ పెర్‌ఫాం చేశాయి. 
 
ఐటీ 1 శాతం క్షీణించగా,  ఆటో, మెటల్‌, బ్యాంక్స్‌ జోరు రియల్టీ  లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.  నిఫ్టీ  టాటా మోటార్స్‌,  ఐషర్‌, ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, యాక్సిస్‌, హీరో మోటో, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ భారీగా లాభపడ్డాయి. మరోవైపు  టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, జీ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా 3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.

మరిన్ని వార్తలు