దివాలీ దౌడు : డబుల్‌ సెంచరీ లాభాలు

6 Nov, 2018 09:56 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమైనాయి.  సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడం, దీపావళి పర్వదినం సందర్భంగా కొనుగోళ్ల వెలుగులు ప్రసరిస్తున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించగా.. నిఫ్టీ హాఫ్‌ సెంచరీ చేసింది. దీంతో సెన్సెక్స్‌ 35వేల స్థాయిని,  నిఫ్టీ 10,500పాయింట్ల మైలురాయిని అధిగమించాయి.  ప్రస్తుతం 207 పాయింట్లు ఎగిసి 35,157వద్ద,  నిఫ్టీ  57 పాయింట్లు లాభంతో  10,581 వద్ద ట్రేడవుతోంది.

మెటల్‌, ఆటో, రియల్టీ, ఐటీ రంగాలు  లాభపడుతుండగా, పీఎస్‌యూ బ్యాంక్స్‌,  ఫార్మా నష్టాల్లో  ఉన్నాయి. టాటామోటార్స్‌, గెయిల్‌ బజాజ్‌ ఫిన్‌, గెయిల్‌, ఎస్‌బ్యాంకు, టీసీఎస్, సన్‌ఫార్మా,ఆర్‌ఐఎల్‌ లాభపడుతున్నాయి. వేదాంతా , అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ , ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌,హెచ్‌పీసీఎల్‌, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ,  డాక్టర్‌ రెడ్డీస్‌  నష్టపోతున్నాయి. మరోవైపు  డాలరుమారకంలో రూపాయి సానుకూలంగా  ఆరంభమైంది. డాలరుతో పోలిస్తే  21పైసలు లాభపడింది.
 

మరిన్ని వార్తలు