బ్యాంకుల దన్ను, సిరీస్‌ శుభారంభం

27 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై : వరుస నష్టాలనుంచి కోలుకున్న స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా మూడు రోజుల వరుస నష్టాల నుంచి పుంజుకుని జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు లాభాలతో ప్రారంభ కావడం విశేషం. ఆసియా మార్కెట్ల దన్ను, కొనుగోళ్ల జోరుతో  సెన్సెక్స్‌ 365 పాయింట్లకు పైగా ఎగిసింది.  ప్రస్తుతం 318  పాయింట్లు  ఎగిసి 41482 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 12213 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్నిరంగాల షేర్లలోనూ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లు లాభపడుతున్నాయి. అలహాబాద్‌, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జేఅండ్‌కే బ్యాంక్‌ 4-1.25 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. వీటితోపాటు పవర్‌గ్రిడ్‌, భారతి ఎయిర్‌టెల్‌, రియలన్స్‌, టెక్‌మహీంద్ర,  బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా లాభాల్లోఉన్నాయి. బ్రిటానియా, యస్‌ బ్యాంకు, విప్రో, కోటక్‌మహాంద్ర, టీసీఎస్‌,అ‍ల్ట్రాటెక్‌ సిమెంట్‌, జెఎస్‌ డబ్ల్యూ స్టీల్‌,  ఎం అండ్‌ ఎం టైటన్‌ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో  రూపాయి బలహీంగా ఉంది. 

మరిన్ని వార్తలు