రికార్డు స్థాయి : 41వేల వైపు చూపు

25 Nov, 2019 16:38 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. రోజంతా లాభాలతో మురిపించిన సూచీలు, చివరికి గరిష్ట స్థాయిల వద్ద స్థిరంగా ముగిసాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సూచీలు రికార్డు పరుగులు తీశాయి.  సెన్సెక్స్‌ 529 పాయింట్లు పెరిగి 40,889 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. అటు ఇక నిఫ్టీ 159  పాయింట్ల లాభంతో12,073 వద్ద ముగిసింది. ఆల్‌  టైం రికార్డును అధిగమించేందుకు అతి చేరువలో ఉంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలతో మెటల్‌ షేర్లు భారీగా లాభపపడగా అన్ని రంగాల్లోనూ విస్తృత కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ముఖ్యంగా టెలికాం, మెటల్‌, అటో, రియల్టీ రంగ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతుతోపాటు ప్రైవేట్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడటం మార్కెట్‌కు ఊతమిచ్చింది.

భారతి ఎయిర్టెల్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి సుజుకి, కోటక్‌ మంహీంద్ర, టాటామోటార్స్‌, ఆసియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌గా జీ, ఓఎన్‌జీసీ, యస్‌బ్యాంకు, వేదాంతా, బీపీఎల్‌, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌ నిలిచాయి.

మరిన్ని వార్తలు