చివరి గంటలో ర్యాలీ : భారీ లాభాలు

18 Jun, 2020 15:42 IST|Sakshi

34200 ఎగువకు సెన్సెక్స్ 

నిఫ్టీ 10వేల ఎగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  భారీ లాభాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి రేంజ్ బౌండ్ పద్ధతిలో సాగినా మిడ్ సెషన్ తరువాత నష్టాలనుంచి అనూహ్యంగా పుంజుకున్న సూచీలు  భారీ లాభాలను సాధించాయి.  సెన్సెక్స్ 700 పాయింట్లు ఎగిసి 34208 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు లాభంతో 1091వద్ద  స్థిరపడ్డాయి. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన భరోసాతో ఇన్వస్టర్లు కొనుగోళ్లకు దిగారు. దీనికి తోడు ఏజీఆర్ వివాదంలో టెలికం కంపెనీల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడానికి డాట్ కు జూలై మూడవ వారం వరకు గడువు ఇస్తూ  సుప్రీంకోర్టు   తీర్పు నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు నెలకొంది. దీంతో సెన్సెక్స్ 34200 పాయింట్లకు ఎగువన, నిఫ్టీ 10వేల  ఎగువన పటిష్టంగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలతో నిఫ్టీ బ్యాంకు కూడా  స్థిరంగా ముగిసింది. 

బజాజ్ ఫిన్‌సర్వ్ భారీగా లాభపడగా, కోల్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, , యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ పవర్ గ్రిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఐటీసీ లాభపడ్డాయి. మరోవైపు ఓఎన్‌జిసి, భారతి ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, హిందుస్తాన్ యూనిలీవర్, మారుతి సుజుకి, సన్ ఫార్మా  నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు