వ్యాక్సిన్‌పై ఆశలు : మార్కెట్ల దూకుడు

15 Jul, 2020 11:53 IST|Sakshi

ఐటీ జోరు, సెన్సెక్స్‌ 760 పాయింట్లు జంప్‌

10800 ఎగువన నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆసియా మార్కెట్లు సంకేతాలకు తోడు, కరోనా నివారణకు త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందన్న అంచనాల మధ్య  భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌  ప్రస్తుతం 762 పాయింట్లు ఎగిసి  36774 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పుంజుకుని 10824 వద్ద ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల దూ​కుడును ప్రదర్శిస్తున్నాయి.

ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు అదరగొడుతున్నాయి.  దీంతో నిఫ్టీ ఐటీ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 3 శాతానికి పైగా  ఎగిసింది. విప్రో టాప్‌  విన్నర్‌గా ఉండగా,ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎన్‌ఐఐటీ టెక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, టీసీఎస్‌  షేర్లు లాభపడుతున్నాయి. ఇంకా రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, టాటాస్టీల్‌, హిందాల్కో కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు భారతి ఎయిర్‌టెల్‌, జీ, శ్రీసిమెంట్స్‌, నెస్లే, ఆసియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ఎం నష్టపోతున్నాయి.  ఈ ఉత్సాహాన్ని అందిపుచ్చుకున్న దేశీయ కరెన్సీ రూపాయి కూడా నిన్నటి నష్టాలనుంచి తేరుకుంది. బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే డాలరు మారకంలో ఎనిమిది పైసలు ఎగిసి 75.34 వద్దకొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు