భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

26 Aug, 2019 14:58 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆర్థికవ్యవస్థ వృద్ధికి దన్నుగా వారాంతాన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసాయి. దీంతో ఒక దశలో 800 పాయింట్లు మేర సూచీలు లాభపడ్డాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలపైన  కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 712 పాయింట్లు ఎగసి 37,3420 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 11,034 వద్ద ట్రేడవుతోంది. అయితే  భారీ ఒడిదుడుకుల  ధోరణి  నెలకొంది. అయితే ముగింపులో  కీలక స్థాయిలు నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి. 

ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా, రియల్టీ, ప్రయవేట్‌ బ్యాంక్స్‌ 2.2-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే మెటల్స్‌ 3 శాతం, ఐటీ 0.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీ హౌసింగ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ 4.4-2.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటో, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, హిందాల్కో, బజాజ్‌ ఆటో, వేదాంతా, కోల్‌ ఇండియా, సిప్లా, ఓఎన్‌జీసీ  నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు