బుల్‌ రన్‌,  ఆల్‌ టైం గరిష్టానికి సెన్సెక్స్‌

6 Nov, 2019 14:27 IST|Sakshi

12,000  వద్ద  నిఫ్టీ

కొత్త గరిష్టానికి  చేరువలో

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 101 పాయింట్లు బలహీనపబడగా, నిఫ్టీ 11900 స్థాయిని కోల్పోయింది. అయితే మిడ్‌  సెషన్‌ తరువాత  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు రెండూ గరిష్ట స్థాయిలను నమోదు  చేసాయి. సెన్సెక్స్‌ 346 పాయింట్లకు పైగా ఎగిసి 40606 స్థాయిని నమదు చేయగా, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 12000 స్థాయిని టచ్‌ చేసింది.  ఈ ఏడాది జూలై 12103 స్తాయి వద్ద ఆల్‌ టై గరిష్టానికి చేరింది. ఆ తరువాత ఆ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.   ప్రధానంగా రియల్టీ,  ప్రయివేట్‌ బ్యాంక్స్‌ మీడియా, ఫార్మా, మెటల్‌ రంగాలు లాభపడుతున్నాయి. టైటన్‌, భారతి ఎయిర్‌టెల్‌, ఐవోసీ, మారుతి సుజుకి,  టాటా స్టీల్‌ ఎస్‌బీఐ, రిలయన్స్‌ గెయిల్స్‌ నష్టపోతుండగా, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌, హెడ్‌ఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్ర, కోల్‌ ఇండియా లాభపడుతున్నాయి.

మరిన్ని వార్తలు