స్టాక్ మార్కెట్ కు రూపాయి షాక్

21 Aug, 2013 15:56 IST|Sakshi
స్టాక్ మార్కెట్ కు రూపాయి షాక్
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి విలువ మరింత క్షీణించి చారిత్రాత్మక కనిష్ట స్ఠాయిని నమోదు చేసుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ప్రతికూలంగా స్పందించాయి. 
 
బుధవారం సానుకులంగా ఆరంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు సాధించిన లాభాలు మధ్యాహ్నానికల్లా ఆవిరయ్యాయి. సెన్సెక్స్ 18545 పాయింట్ల ఆరంభమై.. క్రితం ముగింపుకు 300 పాయింట్ల కు పైగా లాభాన్ని సాధించి 18567 పాయింట్ల ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసుకుంది. ఆరంభంలో సాధించిన లాభాలకు రూపాయి గండి కొట్టడంతో సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో సెన్సెక్స్ 17807 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. 
 
ఇంట్రాడే ట్రేడింగ్ లో నిఫ్టీ గరిష్టంగా 5504, 5268 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసుకుంది. నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 5302 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 340 పాయింట్ల పతనంతో 17905 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
 
నేటి మార్కెట్ లో అత్యధికంగా రాన్ బాక్సీ 12 శాతం, సెసా గోవా 10, జయప్రకాశ్, ఏసీసీ, భారతీ ఎయిర్ టెల్ సుమారు ఏడు శాతం నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, భెల్, హెచ్ డీ ఎఫ్ సీ, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 
మరిన్ని వార్తలు