దలాల్‌ స్ట్రీట్‌కు బడ్జెట్‌షాక్‌

5 Jul, 2019 15:59 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు బడ్జెట్‌  రోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. నేడు (శుక్రవారం) ఆరంభంలో లాభాల సెంచరీతో సెన్సెక్స్‌ మరోసారి 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్‌ ప్రసంగం మొదలు నుంచి చివరివరకూ అమ్మకాల సెగ సూచీలను భారీగా తాకింది. ఒక దశలో  450 పాయింట్లు కోల్పోయి చివరికి సెన్సెక్స్‌ 394 పాయింట్లు నష్టంతో 39513 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 11811 వద్ద ముగిసాయి.  దాదాపు  అన్ని  రంగాలు నష్టపోయాయి. అయితే బడ్జెట్‌లో ప్రభుత్వ బ్యాంకులకులభించిన ఊరట నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి లభించిన మద్దతుతో  సంబంధిత షేర్లు లాభపడ్డాయి.  

అలాగే బంగారంపై దిగుమతి సుంకం పెంపుతో జ్యుయల్లరీ షేర్లు  ట్రేడర్ల అమ్మకాల షాక్‌కు గురయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఆటో, మెటల్‌, ఐటీ భారీగా నష్టపోయాయి. టీసీఎస్‌, యస్‌ బ్యాంకు, వేదాంతా  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు