నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

10 Aug, 2018 09:52 IST|Sakshi
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల జోరుకు బ్రేకిచ్చాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ప్రస్తుతం 68 పాయింట్ల నష్టంలో 37,957 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంలో 11,452 వద్ద ట్రేడవుతున్నాయి. జోరుగా హుషారుగా సాగుతున్న బ్యాంక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడ్డారు. మరోవైపు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫలితాలు కూడా నేడే కావడంతో, ఆ బ్యాంక్‌ షేరు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

ఐటీ, మెటల్‌ మాత్రం కాస్త బలంగా ట్రేడవుతున్నాయి. మళ్లీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు భారీగా 10 శాతం మేర పడిపోతున్నాయి. ఈ ఎయిర్‌లైన్‌ తన ఫలితాలను వాయిదా వేయడంతో పాటు, ఆడిట్‌ ప్యానల్‌ కూడా ఫలితాల ప్రకటనకు నిరాకరించిందని తెలిసింది. ఈ వార్తల నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీగా పడిపోతుంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంలో 68.83 వద్ద ప్రారంభమైంది.
 

మరిన్ని వార్తలు