హుషారుగా సెన్సెక్స్‌ , 40వేలు మార్క్‌ టచ్‌ 

30 Oct, 2019 09:28 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లో ప్రారంభమైనాయి.  ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్‌ ఆరంభంలోనే 173 పాయింట్లు ఎగిసి తొలిసారిగా  40 వేల స్థాయిని టచ్‌ చేసింది. నిప్టీ 60 పాయింట్లకు పైగా లాభపడి 11, 850 ని టచ్‌ చేసింది. ప్రస్తుతం స్వల్పంగా వెనక్కి తగ్గినా స్థిరంగా కొన సాగుతున్నాయి.  అటు  బ్యాంక్‌నిఫ్టీ కూడా 30వేల మార్క్‌ను  తాకింది. భారతి ఎయిర్‌టెల్‌,  ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ,  భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, అ‍ల్ట్రాటెక్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌బ్యాంకు, సన్‌ఫార్మ, కోటక్‌ మహీంద్ర లాభపడుతున్నాయి.   సిప్లా, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఓన్‌జీసీ, ఎం అండ్‌ ఎం మారుతి, ఐసీఐసీ నష్టపోతున్నాయి. 
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు