అమ్మకాల ఒత్తిడి: లాభనష్టాల ఊగిసలాట

11 Sep, 2018 10:01 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం  కొద్గాది పుంజుకుని లాభాల్లో ప్రారంభమైనాయి.  లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ తీవ్ర  ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.  సోమవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకుని  100పాయింట్ల లాభాలతో  ప్రారంభమైన కీలక సూచీలు వెంటనే  ఫ్లాట్‌ గా మళ్లాయి.  సెన్సెక్స్‌  11 పాయింట్ల లాభంతో 37,933 వద్ద , నిఫ్టీ 2పాయింట్ల లాభంతో 11,440 వద్ద కొసాగుతున్నాయి.

ఐటీసీ, హిందుస్థాన్‌ యూనీ లీవర్‌, హీరో మోటో కార్ప్‌, టాటా స్టీల్‌, కొటక్‌ మహీంద్ర టాప్‌ లూజర్స్‌ గా  ఉన్నాయి.  యాక్సిస్‌, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్‌, అదానీ, ఎస్‌బీఐ టాప్‌ విన్సర్స్‌గా ఉన్నాయి.
మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి కూడా ట్రేడింగ్‌ ఆరంభంలో పుంజుకున్నా, మల్లీ  నష్టాలబాటపట్టింది. డాలరు మారకంలో 73 పైసలు నష‍్టపోయి 72.47వద్ద ఉంది.
 
 

మరిన్ని వార్తలు