ఊహించని వడ్డీరేటు: పుంజుకున్న మార్కెట్లు

5 Dec, 2019 14:28 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరే‍ట్లపై అనూహ్య ప్రకటన అనంతరం ఆరంభ లాభాలనుంచి  వెనక్కి తగ్గిన సూచీలు మిడ్‌సెషన్‌ తరువాత పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 90 పాయింట్లుఎగిసి 40939 వద్ద,నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 12059 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 12050 స్థాయికి పైకి చేరింది.

ఆర్‌బీఐ నేడు కీలకమైన పరపతి విధాన సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.  రెపోరేటు ప్రస్తుతం ఉన్న 5.15శాతం వద్దే కొనసాగనుంది. మరోవైపు రివర్స్‌ రేటు 4.90 వద్ద, బ్యాంక్‌ రేటు 5.40శాతం వద్ద కొనసాగుంది. దీంతో దాదాపు అన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. మరోవైపు ఐటీ రంగ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్‌, ఐటీసీ, లార్సెన్‌, ఇ‍న్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు,రిలయన్స్‌ లాభపడుతున్నాయి. కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యు, భారతి ఎయిర్‌టెల్‌,  టాటా స్టీల్‌, గెయిల్‌, బీపీసీఎల్‌ సన్‌ ఫార్మా గ్రాసిం నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు