దలాల్‌ స్ట్రీట్‌లో ఎగ్జిట్‌ పోల్స్‌ హవా

15 Dec, 2017 09:45 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.ముఖ్యంగా గుజరాత్‌ బీజేపీకి ఎదురు లేదన్న సంకేతాలతో దలాల్‌స్ట్రీట్‌లో ఉత్సాహం ​నెలకొంది.    ఆరంభంలో 358 పాయింట్ల లాభాలను నమోదు చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం సెన్సెక్స్‌ 303 పాయింట్లు ఎగిసి 33,549 వద్ద,  నిఫ్టీ సైతం 98పాయింట్లు పుంజుకుని 10,350 వద్ద కొనసాగుతున్నాయి.


దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే.  ముఖ‍్యంగా మెటల్‌, రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో సెక్టార్లో కొనుగోళ్లు భారీగా నెలకొన్నాయి.   అదానీ పోర్ట్స్‌, వేదాంతా, బజాజ్‌ ఆటో, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, హిందాల్కో, గెయిల్‌, టాటా మోటార్స్‌, యస్‌బ్యాంక్‌  లాభాల్లో ఉండగా, అంబుజా, కొటక్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌  స్వల్పంగా నష్టపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు