బలహీనంగానే స్టాక్‌మార్కెట్లు

12 Jun, 2019 14:34 IST|Sakshi


సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగానే కొనసాగుతున్నాయి.  ఆరంభ నష్టాల నుంచి ఏమాత్రం కోలుకోలేదు సరికదా మరింత దిగజారాయి.  లాభాల స్వీకరణతో  300 పాయింట్లు పతనానికి చేరువైన సెన్సెక్స్‌ ప్రస్తుతం 192 పాయింట్లు క్షీణించి 39,758 వద్ద,   నిఫ్టీ 62 పాయింట్లు  నష్టపోయి 11,902 వద్ద కొనసాగుతోంది.  మెటల్‌ తప్ప దాదాపుఅన్ని రంగాలూ  బలహీనంగానే ఉన్నాయి. ప్రధానంగా రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1 శాతం స్థాయిలో  నష్టపోతున్నాయి. ఐబీ హౌసింగ్‌ 7 శాతం పతనంకాగా, యస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఆటో, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ, హీరోమోటో, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌ 3-1.4 శాతం నష్టాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు  టాటా స్టీల్‌, గెయిల్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, వేదాంతా, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌  టాప్‌  విన్నర్స్‌గా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు