ప్రాంతీయ భాషల్లో  వెబ్‌సైట్లకు సర్వర్లు సిద్ధం 

2 Apr, 2019 00:41 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లో వెబ్‌సైట్లను రిజిస్టర్‌ చేసుకునేందుకు ఉపయోగపడేలా అంతర్జాతీయ ఇంటర్నెట్‌ సర్వర్లు సిద్ధమవుతున్నాయి. జూన్‌ కల్లా ఈ ప్రక్రియ పూర్తి కాగలదని యూనివర్సల్‌ యాక్సెప్టెన్స్‌ స్టీరింగ్‌ గ్రూప్‌ (యూఏఎస్‌జీ) చైర్మన్‌ అజయ్‌ డాటా తెలిపారు. ఈ తొమ్మిది భాషల్లో తెలుగు సహా తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతి, బెంగాలీ, ఒరియా మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం ఇంగ్లిష్‌ కాకుండా దేవనాగరి, అరబిక్, మాండరిన్, రష్యన్‌ తదితర కొన్ని భాషల్లో మాత్రమే వెబ్‌సైట్‌ను నమోదు చేసుకోవడానికి వీలుంటోంది. ఇంటర్నెట్‌ వెబ్‌సైట్ల పేర్లు తదితర అంశాలను సమీక్షించే అంతర్జాతీయ సమాఖ్య ఐకాన్‌లో భాగంగా యూఏఎస్‌జీ ఏర్పాటైంది. అరబిక్, హీబ్రూ, జపానీస్, థాయ్‌ తదితర భాషల్లో వెబ్‌సైట్ల నమోదుకు అవసరమైన ప్రమాణాలను రూపొందించే బాధ్యత దీనికి అప్పగించారు. 

మరిన్ని వార్తలు