మరింత చవగ్గా సెట్ టాప్ బాక్సులు

4 Jan, 2016 11:11 IST|Sakshi
మరింత చవగ్గా సెట్ టాప్ బాక్సులు

మరో రెండు నెలల్లో తప్పనిసరిగా కేబుల్ వినియోగదారులందరూ సెట్‌టాప్ బాక్సులు పెట్టుకోవాల్సిందే. లేకపోతే ఇక కేబుల్ ప్రసారాలు రావని చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వినియోగదారులకు ఓ శుభవార్త. సెట్‌టాప్ బాక్సులు త్వరలో మరింత చవగ్గా లభించబోతున్నాయి. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (సీఏఎస్) లైసెన్సు ఫీజు బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఒక్కో లైసెన్సుకు రూ. 120- 180 వరకు ఈ ఫీజు ఉండగా, త్వరలోనే ఇది రూ. 32 కాబోతోంది.

ప్రస్తుతం సెట్‌టాప్ బాక్సులు రూ. 800-1200 మధ్య లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన బైడిజైన్ అనే సంస్థతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థ సి-డాక్ దేశీయంగానే సీఏఎస్ వ్యవస్థను అభివృద్ధి చేయడంతో ఇది సాధ్యమైంది. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 30 కోట్ల వరకు ఉండగా, అందులో దాదాపు రూ. 20 కోట్ల మొత్తాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఇస్తోంది. మిగిలిన 10 కోట్లను బై డిజైన్ సంస్థ భరిస్తుంది.

మరిన్ని వార్తలు